Pavitra Lokesh: వామ్మో.. పవిత్ర లోకేశ్ ఏకంగా అంత పారితోషికం తీసుకుంటున్నారా?

ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న పవిత్ర లోకేశ్ క్రేజ్ ను సైతం అంతకంతకూ పెంచుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వరకు పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్ 50,000 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం పవిత్ర రెమ్యునరేషన్ రెట్టింపు చేసిందని బోగట్టా. రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

మళ్లీ పెళ్లి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే పవిత్ర లోకేశ్ కెరీర్ కు మరింత మేలు జరిగేదని చెప్పవచ్చు. మళ్లీ పెళ్లి సినిమా కథ, కథనం అందరికీ తెలిసిన కథతో తెరకెక్కడంతో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు.

తొలిరోజు ఈ సినిమాకు 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా నిర్మాతగా నరేష్ కు ఈ సినిమా భారీ షాకివ్వడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్ర లోకేశ్ కు తెలుగులో క్రేజ్ పెరుగుతుండటంతో నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మళ్లీ పెళ్లి సినిమాకు సీక్వెల్ వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర లోకేశ్ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని మరి కొందరు చెబుతున్నారు.

నరేష్, పవిత్ర లోకేశ్ (Pavitra Lokesh) పెళ్లి కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని సమాచారం. నరేష్ కు ప్రస్తుతం ఉన్న కోర్టు సమస్యలు తొలగిపోతే నరేష్ పవిత్రల పెళ్లికి సంబంధించిన శుభవార్తను వినవచ్చు. నరేష్ పవిత్రల గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం మార్చడానికి మళ్లీ పెళ్లి తీశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలపై పవిత్ర ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus