అనంతపురం సభలో పవన్ కళ్యాణ్
- November 10, 2016 / 01:23 PM ISTByFilmy Focus
ఏసీ గదుల్లో కూర్చొనే వారికీ స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు.. కానీ కరువు కాటకాల్లో విలవిల్లాడుతున్న అనంతపురం వంటి జిల్లాల వారికి అమృతపు చుక్క లాంటిదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలని తాను కుటుంబాన్ని సైతం వదిలి బీజీపీ, టీడీపీ నేతలకు అండగా నిలిచానని చెప్పారు.
ఓట్లు కావాలని వచ్చినప్పుడు సులువుగా మాట్లాడిన నేతలు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడుగుతుంటే అర్ధం కానీ విధంగా మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీలు ప్రజల పక్షాన నిలబడకపోతే మీ పునాదులు కూలదోస్తామని హెచ్చరించారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుంటే సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















