టాలీవుడ్ టాప్ హీరోస్ లో మెగాస్టార్ కి ప్రత్యేక స్థానం ఉంది. స్వయంకృషితో వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అయితే ఆయన వారసుడిగా, ఆయన ఇమేజ్ ను ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే పవన్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు, ఒక రాజకీయ పార్టీకి అధినేత కూడా, ఒక రకంగా చెప్పాలి అంటే అభిమానులకు దైవంతో సమానం. ఇదిలా ఉంటే తాజాగా మాస్ మహారాజా రవితేజ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ఫాన్స్ ను బాగా హర్ట్ చేశాయి.
దాదాపుగా సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో రవి పై ఇష్టం వచ్చినట్లుగా పవన్ అభిమానులు తమదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ఇంతకీ రవి ఏమన్నాడంటే…తాను హిందీ బాగా మాట్లాడగలననీ, తెలుగు కంటే హిందీ భాషే బాగా వచ్చునని చెప్పాడు. తనది తెలుగు సినిమా నేపధ్యం కాబట్టి వెంటనే బాలీవుడ్ లోకి వెళ్లి విజయం సాధించాలన్న తపన లేదన్నాడు. ఒక సినిమా హిట్ కావడానికి స్టార్ ఇమేజ్ మాత్రమే సరిపోదని కథా కధనం బలంగా ఉండాలని అలా ఉంటేనే జనాలు ఆధరిస్తారని అన్నారు. కేవలం మాస్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ సినిమాలే చేస్తే తప్పు చేసినట్లే అని అన్నాడు. ఇక ఆయన మనసులో ఏముందో కానీ, పవన్ అభిమానులు మాత్రం దీనిని కొంచెం రాంగ్ గా తీసుకున్నారు. రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం, అక్కడ ఫెయిల్యూర్ అవ్వటం చూసే రవి ఇలా మాట్లాడాడు అని పవన్ ఫ్యాన్స్ ఆయన పై ఫైయర్ అయిపోతున్నారు. మరో పక్క ఏది ఏమైనా…ఈ వ్యక్తి పూజ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని విశ్లేషకులు చెబుతున్నారు.