‘హరిహర వీరమల్లు’ జూన్ 24న విడుదల కానుంది. ‘బ్రో’ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమా ఇది. ఆల్మోస్ట్ ఇది పవన్ కళ్యాణ్ కు మరో రీ- ఎంట్రీ లాంటిదే. మొఘల్ కాలం నాటి చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా ఇది. మరో రకంగా పీరియాడిక్ మూవీ అనమాట. 2024 ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ ‘హరిహర వీరమల్లు’ ని దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏ.ఎం.రత్నం..లు యాక్టివ్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా హీరోయిన్లు ఓ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎవ్వరూ ఇంట్రెస్టింగ్ రాని రోజుల్లో నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం చాలా మంది హీరోయిన్లకి స్ఫూర్తినిచ్చే విషయం అని చెప్పాలి. ఇక దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ఇందులో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని రివీల్ చేశాడు. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్‌ను ఏకంగా 60 రోజుల పాటు చిత్రీకరించారట.
పవన్ కళ్యాణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ఎటువంటి బాడీ డబుల్ లేకుండా కంప్లీట్ చేశారట. దీని కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. థియేటర్లలో ఈ యాక్షన్ సీన్ మంచి కిక్ ఇస్తుందని.. గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని తెలిపారు. ఇక ‘హరిహర వీరమల్లు’ లో మొత్తం ఆరు ఫైట్స్ ఉంటాయట. అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయని తెలిపారు.