రజినీకాంత్ – నాగార్జున..ల ‘కూలి’, ఎన్టీఆర్ -హృతిక్ రోషన్..ల ‘వార్ 2’ సినిమాలు ఒకే రోజు అంటే ఆగస్టు 14 నే రిలీజ్ కానున్నాయి. వీటిలో ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే ‘కూలి’ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా థియేటర్ హక్కులను కొనుగోలు చేయాలని నాగవంశీ భావించారు. కానీ ఎందుకో చివర్లో వెనక్కి తగ్గారు. తర్వాత ఆయన ‘వార్ 2’ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు రూ.80 కోట్లు పెట్టి ‘వార్ 2’ హక్కులను కొనుగోలు చేశారు నాగవంశీ.
అయితే ఈ 2 సినిమాల్లో ఆడియన్స్ కి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయంపై నాగవంశీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘వార్ 2’ వర్సెస్ ‘కూలి’ అనుకుంటే… మీ ఫస్ట్ ఛాయిస్ ఏది?’ అంటూ యాంకర్ నాగవంశీని ప్రశ్నించాడు. అందుకు నాగవంశీ.. ‘నేను నిర్మాత కాబట్టి నా ఒపీనియన్ పక్కన పెడదాం.. ఓ కామన్ ఆడియన్ గా మీరు ఫస్ట్ షో ఏం చేస్తారు?’ అంటూ రివర్స్ లో యాంకర్ ను ప్రశ్నించారు నాగవంశీ. అందుకు యాంకర్ ‘ ‘వార్ 2′ చూస్తాను అంటూ బదులిచ్చారు’.
‘ఎందుకు?’ అంటూ నాగవంశీ మళ్ళీ ఆ యాంకర్ ని ప్రశ్నిస్తే.. అందుకు ఆ యాంకర్ ‘ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో ఉన్నారు కదా?’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత నాగవంశీ ‘అదే నేను చెబుతున్నాను. తారక్ అన్న ఉన్నారు కాబట్టి.. కచ్చితంగా ‘వార్ 2’ ఫస్ట్ చూస్తారు. మ్యాట్నీకి నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ‘కూలి’ కి వెళ్తారు. తెలుగులో ఓ పెద్ద హీరో నటించిన సినిమా కాబట్టి.. ‘వార్ 2′ ని తెలుగు ప్రేక్షకులు ముందుగా చూస్తారు. దాన్ని డబ్బింగ్ సినిమాగా భావించరు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.