పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు టాలీవుడ్ పెద్దలతో సమావేశమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) వంటి పెద్దలతో ఆయన సమావేశమై ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కీలక విషయాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో ఆయన ముచ్చటించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) కేసుపై కూడా స్పందించారు. ‘అల్లు అర్జున్ ను మాత్రమే దోషిగా భావించడం తప్పని, థియేటర్ యాజమాన్యం ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుండేదని, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారని, రేవంత్ రెడ్డి..
Pawan Kalyan
వైసీపీ ప్రభుత్వం మాదిరి వ్యవహరించలేదు అని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన సాయపడేందుకు సిద్ధంగా ఉన్నారని, ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) టికెట్ రేట్ల పెంపుకి, బెనిఫిట్ షోలకి ఆయన అనుమతులు ఇచ్చారని’ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరోపక్క ఆయన ‘ఓజీ’ (OG Movie) తో పాటు పూర్తి చేయాల్సిన సినిమాల గురించి స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వాటిపై స్పందిస్తూ.. ” ‘ఓజి’ సినిమా కథ 1980,90..ల నాటిది. ‘ఓజి’ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్ధం.
నేను ఎక్కడికి వెళ్లినా ‘ఓజి ఓజి’ అని అరుస్తున్నారు.అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను అన్ని సినిమాలకి డేట్స్ ఇచ్చాను. కానీ వాళ్లు సరిగా సద్వినియోగపరుచుకోలేదు.’హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) 8 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.అన్ని సినిమాలను నేను పూర్తి చేస్తాను. ఒక్కో సినిమాగా నేను పూర్తి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నుండి ‘ఓజి’ తో పాటు ‘హరి హర వీరమల్లు’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటి సినిమాలు కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ‘ఓజి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.