పవన్ కళ్యాణ్‌తో ఆడి పాడిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ముంతాజ్.. ఈ పేరు చెప్తే టక్కున గుర్తు పట్టకపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ పక్కన ‘ఖుషి’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన బ్యూటీ అంటే మాత్రం.. ‘ఓ ఆ బొద్దుగుమ్మా?’ అంటూ వెంటనే గుర్తు పట్టేస్తారు.. మహారాష్ట్రకు చెందిన ముద్దుగుమ్మ ముంతాజ్ అసలు పేరు.. నగ్మా ఖాన్.. అప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమే గుర్తొచ్చేది.. తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ముంతాజ్.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్ మరియు యంగ్ హీరోల పక్కన ఆడిపాడింది.. కవ్వించే కళ్లు, మత్తెక్కించే చూపులతో కుర్రకారు హృదయాల్ని కొల్ల గొట్టేసింది..

ఆమె అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది..తెలుగులో ‘చాలాబాగుంది’ తో ఎంట్రీ ఇచ్చి.. ‘అమ్మో ఒకటో తారీఖు’ లో చేసినా కానీ ‘ఖుషి’ తోనే గుర్తింపు వచ్చింది. వెంకీతో ‘జెమిని’ లోనూ ఆడిపాడింది.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్ ‘అత్తారింటికి దారేది’ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ముంతాజ్ కొద్ది కాలంగా సినిమాలు చెయ్యట్లేదు.. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది.. కొద్ది కాలం క్రితమే తను పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలు కూడా ఉన్నట్టు ఆ పిక్స్ చూస్తే అర్థమవతోంది.. ప్రస్తుతం ముంతాజ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus