ఒకే వేదికపై కలుసుకోనున్న పవన్ కళ్యాణ్, కేసీఆర్ !
- September 12, 2016 / 12:13 PM ISTByFilmy Focus
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ లు కలవనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు ఒకే కార్యక్రమంలో కలుసుకోనున్నట్లు వెల్లడించాయి. అయితే సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుకునేందుకు కాదని వివరించాయి. వైభవంగా జరగనున్న ఓ చిత్ర ఆడియో వేడుకకు ఈ ఇద్దరు నేతలు హాజరుకాబోతున్నట్లు తెలిపింది. మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ “జాగ్వార్” సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు.
75 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని కొద్దిరోజుల క్రితం కుమారస్వామి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆహ్వానించారు. అందుకు పవన్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ సమయంలో పవన్‌ను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆడియో విడుదలకు రావాలని కోరారు. అయన కూడా ఒకే చెప్పారని సమాచారం. సీమాంధ్ర ప్రత్యేక హోదాతో హీటెక్కిన పరిస్థితుల్లో పవన్, కేసీఆర్ లు ఒకే వేదిపై కలవనుండడం ఆసక్తి కలిగిస్తోంది.

















