తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ప్రభాస్, పవన్ ముందువరసలో ఉంటారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కొన్ని వారాల గ్యాప్ లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. ప్రభాస్, గోపీచంద్ తో కలిసి ఈ షోకు హాజరు కాగా పవన్ కళ్యాణ్ క్రిష్ తో కలిసి ఈ షోలో కనిపించనున్నారు.
త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు ఎపిసోడ్ల వల్ల ఆహా సబ్ స్క్రిప్షన్లు అంచనాలకు మించి పెరుగుతున్నాయని సమాచారం. బాలయ్య పవన్ ఎపిసోడ్ షూట్ ఈ నెల 27వ తేదీన జరుగుతుండగా మెగా నందమూరి హీరోల కాంబో ఎపిసోడ్ కావడంతో ఈ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే పవన్ ఈ ఇంటర్వ్యూలో ఏయే విషయాలను రివీల్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2023 సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి ఈ నెలాఖరున క్లారిటీ రానుందని తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల తర్వాత పవన్ ప్రకటించిన ప్రాజెక్ట్ లలో మెజారిటీ సినిమాలు రీమేక్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. పవన్ రీమేక్ సినిమాలలో నటించడం గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తెరి రీమేక్ విషయంలో అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ కామెంట్లు పవన్ దృష్టికి కూడా వచ్చినా సరైన సందర్భం రాకపోవడంతో పవన్ స్పందించలేదు. అయితే అన్ స్టాపబుల్ వేదికగా తనపై రీమేక్ సినిమాల విషయంలో వచ్చిన విమర్శలకు పవన్ ఒకింత ఘాటుగానే జవాబులివ్వనున్నారని తెలుస్తోంది. బాలయ్య పవన్ ను అడిగే ప్రశ్నల జాబితా ఇప్పటికే సిద్ధమైందని ఇటు సినీ అభిమానులను ఇటు పొలిటికల్ అభిమానులను మెప్పించే విధంగా ఈ ఎపిసోడ్ ఉండనుందని తెలుస్తోంది.