పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్ సాబ్ సినిమాతో ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో విజయాలను సొంతం చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి అనుకూల ఫలితాలు రాకపోయినా 2024 ఎన్నికల సమయానికి జనసేన పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా జరిగిన నిహారిక ఇష్యూ వల్ల కొంతమంది నెటిజన్లు మెగా ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జరిగిన ఘటనకు నిహారికకు ఏ సంబంధం లేదని ఆ కేసులో నిహారిక ప్రమేయం లేదని పోలీసులు చెప్పారని నాగబాబు ఇప్పటికే వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. నిహారిక మాత్రం ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే. అయితే నిహారిక ఇష్యూ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్ లో శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనదని అవతలివాడు మనల్ని వాడుకోవడం మన సక్సెస్ అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదేనని పేర్కొన్నారు. నిహారిక పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ ఆమెను సున్నితంగా హెచ్చరించారు. నిహారిక ఏ తప్పు చేయకపోయినా ప్రత్యర్థులు తప్పుగా అనుకునే అవకాశం అయితే ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైరల్ అయిన వార్తల వల్ల నిహారిక మానసిక వేదనకు గురైనట్టు తెలుస్తోంది.
150 మందిలో ఎంతోమంది ప్రముఖుల పిల్లలు ఉన్నప్పటికీ కొందరి పేర్లు మాత్రమే ఎక్కువగా వార్తల్లో వినిపించడం గమనార్హం. నిహారిక కూడా ఈ ఇష్యూ గురించి స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు.
The following quote by Writer’Sri Vakada Srinivas’ reflects the RamManohar Lohia’s thought process on the ascension of BC’s & SC’s into power.
“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…”