Hari Hara Veera Mallu: వీరమల్లు నుంచి లీక్.. సంతోషంలో ఫ్యాన్స్..?
- June 28, 2021 / 08:09 PM ISTByFilmy Focus
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పోలిస్తే హరిహర వీరమల్లు సినిమా కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లీకైన ఒక విషయం వల్ల పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. పాన్ ఇండియా మూవీగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ మల్ల యోధులతో ఫైట్ చేస్తారని క్రిష్ ఈ సినిమాలో ప్రతి సీన్ హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్ ఫ్యాన్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటాయని ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

త్వరలో పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల వల్ల క్రిష్ పవన్ తో గట్టిగానే ప్లాన్ చేశారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని క్రిష్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!
















