పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ప్రవేశించారని ప్రజల్లోకి ఆయన్ను మరింత తీసుకుని వెళ్లేలా కథలో కొన్ని అదనపు హంగులు చేర్చాలా? అవసరం లేదని తన అభిప్రాయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెలియజేశారు. పవర్ స్టార్ అభిమానులు, జనసైనికులు సైతం ఆ విధంగా చేయమని కోరడం లేదన్నారు. “కల్యాణ్ గారు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లకముందు ‘ఖుషి’లో ‘ఏ మేరా జహా’, ‘బద్రి’లో ‘అయామ్ ఎన్ ఇండియన్’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లేలే’ పాటల ద్వారా దేశంపై ఆయనకు ఉన్న ప్రేమను తెలిపారు. సమాజం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు” అని హరీష్ శంకర్ అన్నారు.
‘గబ్బర్ సింగ్’ తరవాత మరోసారి పవన్ కల్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశం హరీష్ శంకర్‌కి దక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ రాయడం పూర్తి చేశానని ఆయన తెలిపారు. అలాగే, 60 శాతం డైలాగులను కూడా రాశానని అన్నారు. పవన్ కల్యాణ్ 28వ సినిమా గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ “అభిమానులు కోరుకునే విధంగా పవన్ కల్యాణ్ గారి పాత్ర ఉంటుంది.
హాయ్ వోల్టేజ్ ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. ‘గబ్బర్ సింగ్’ చేసేటప్పుడు రికార్డులు బ్రేక్ చేయాలని ఆలోచించలేదు. ఒక అభిమానిగా ఆయనను ఎలా చూశానో అలా ప్రజెంట్ చేశా. ఇప్పుడు కూడా అభిమానిలా సినిమా చేస్తా. కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు నాకు కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది” అని అన్నారు.
Most Recommended Video
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!