‘జెట్టి’ చిత్రంతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ మానినేని …. ‘100 డ్రీమ్స్’ అనే ఫౌండేషన్ ను స్థాపించి గత 8 ఏళ్ళ నుండి అనేక సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఏపీలోని విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందువల్ల వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Pawan Kalyan
వారిని ఆదుకోవడానికి చాలా మంది టాలీవుడ్ హీరోలు తమ వంతు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు కృష్ణ మానినేని కూడా చేరారు. ‘100 డ్రీమ్స్ ఫౌండేషన్’ ఫౌండర్ అయినటువంటి కృష్ణ మానినేని అండ్ టీం.. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలలను సందర్శించి ప్రజలకి అనేక విధాలుగా సాయపడ్డారు. ఇది తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణ మానినేనిని ప్రత్యేకంగా ఆహ్వానించి అతన్ని అభినందించారు.
ఇదే క్రమంలో హీరో కృష్ణ మానినేని, ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో అందించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలని ఆయన ప్రత్యేకంగా గమనించి, మా ఈ ప్రయత్నాలను ప్రశంసించడం అనేది మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.
భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలనే మా లక్ష్యానికి కూడా ఇది స్ఫూర్తినిచ్చింది అని చెబుతున్నాను. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి, మాకు టైం ఇచ్చి అభినందించినందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణ మానినేని కామెంట్స్ వైరల్ అవ్వడంతో పవన్ (Pawan Kalyan) అభిమానులు కూడా అతన్ని తెగ పొగిడేస్తున్నారు.
#Jetty Movie Hero, @KrishnaManineni, known for his philanthropic work through the 100 Dreams Foundation, has donated ₹10 lakhs to the AP CM Relief Fund for flood victims.