Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Thalavan Review in Telugu: తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalavan Review in Telugu: తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 12, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Thalavan Review in Telugu: తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • బిజు మీనన్ (Hero)
  • మియా జార్జ్ (Heroine)
  • ఆసిఫ్ అలీ , అనుశ్రీ తదితరులు.. (Cast)
  • జిస్ జోయ్ (Director)
  • అరుణ్ నారాయణ్ - సిజో సెబాస్టియన్ (Producer)
  • దీపక్ దేవ్ (Music)
  • శరణ్ వెలాయుధన్ (Cinematography)
  • Release Date : మే 24, 2024
  • అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్ - లండన్ స్టూడియోస్ (Banner)

మిస్టరీ థ్రిల్లర్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది మలయాళం ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ నుంచి మే నెలలో వచ్చిన తాజా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ “తలవన్” (Thalavan) . బిజు మీనన్ (Biju Menon)  & ఆసిఫ్ అలీ (Asif Ali)  ప్రధాన పాత్రధారులుగా జిస్ జోయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈవారం సోనీ లైవ్ లో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పట్లానే క్యూ కట్టేశారు. సో, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Thalavan Review

కథ: జయశంకర్ (బిజు మీనన్) & కార్తీక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు. వాళ్ల సిన్సియారిటీకి ఈగో కూడా యాడ్ అవ్వడంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే తమ సీనియారిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకరిపై ఒకరు లేనిపోని పంతాలు పెట్టుకుని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో జయశంకర్ ఇంట్లో రమ్య (అనుశ్రీ) శవం దొరకడం పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం కార్తీక్ వాసుదేవన్ ను నియమిస్తుంది.

ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రొఫెషనల్ ఇష్యూస్ కేస్ ఇన్వెస్టిగేషన్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపించాయా? అసలు రమ్య ఎవరు? జయశంకర్ ను ఇరికించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? వంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే “తలవన్” చిత్రం.

నటీనటుల పనితీరు: తెలుగులో ఇదివరకు “రణం(Ranam) , ఖతర్నాక్” చిత్రాల ద్వారా మనకి పరిచయస్తుడైన బిజు మీనన్ ఈ సినిమాలో కాస్త ఈగో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎక్కడా తగ్గలేదు. ఒకే ఫ్లో మైంటైన్ చేయడం మంచి ప్లేస్ పాయింట్ గా నిలిచింది. మరో నటుడు ఆసిఫ్ అలీ పాత్ర కూడా బిజు మీనన్ పాత్రకి పోటీగా ఉన్నప్పటికీ.. అతడి పాత్రలో కాస్త మంచితనం యాడ్ చేసి ఇంకాస్త నీట్ గా ఎలివేట్ చేసారు. సహాయ పాత్రలో మియా జార్జ్ (Miya George) పర్వాలేదనిపించుకోగా.. కథను మలుపు తిప్పే రమ్య పాత్రలో అనుశ్రీ ఆకట్టుకుంది. ఇక మిగతా మలయాళ ఆర్టిస్టులు ఎప్పట్లానే తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు జిస్ జోయ్ “తలవన్” కథను రాసుకున్న విధానం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నిజంగానే క్లైమాక్స్ కి వచ్చే వరకు ఎవరు దొంగ, ఎవరు విలన్ అనే విషయం ఎవ్వరూ గెస్ చేయలేరు. అందువల్ల ప్రేక్షకులు చివరి వరకు సినిమాలో లీనమై, ట్విస్ట్ ఎప్పడు రివీల్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కథనం అంత పక్కాగా రాసుకున్నాడు దర్శకుడు. అలాగే.. వేసిన ఒక్కో చిక్కుముడిని విప్పిన విధానం కూడా బాగుంది.

దీపక్ దేవ్ సంగీతం, శరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ గా నిలిచాయి. యాక్షన్ బ్లాక్స్ అండ్ నైట్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే దీపక్ దేవ్ తనదైన శైలి నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేసిన విధానం కూడా బాగుంది.

విశ్లేషణ: మర్డర్ మిస్టరీ అనగానే పొలోమని క్యారెక్టర్స్ ను ఇన్వాల్వ్ చేసేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించేసే సినిమాలే ఎక్కువగా చూసాం ఇప్పటివరకు. కానీ.. “తలవన్” (Thalavan) అలా కాకుండా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ తో చివరి వరకు సినిమాలో ట్విస్ట్ రివీల్ అవ్వకుండా చాలా పకడ్బందీగా రాసుకున్న విధానం బాగుంది. సోనీలైవ్ యాప్ లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి.. ఈ వీకెండ్ కి మంచి టైమ్ పాస్ ఈ “తలవన్”.

ఫోకస్ పాయింట్: మలయాళం నుండి వచ్చిన మరో మంచి థ్రిల్లర్!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anusree
  • #Asif Ali
  • #Biju Menon
  • #Miya George
  • #Thalavan

Reviews

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

17 hours ago
ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

1 day ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

2 days ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

3 days ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

3 days ago
Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

3 days ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

3 days ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version