పవన్ కళ్యాణ్ నటిస్తోన్న రెండు సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఇవి కాకుండా.. రెండు, మూడు సినిమాలు ఆబ్లిగేషన్లు ఉన్నాయి. భగవాన్ పుల్లారావులకు ఓ సినిమా, పీపుల్స్ మీడియాకు మరో సినిమా, రామ్ తాళ్లూరితో ఇంకో సినిమా చేయాల్సివుంది. అంటే.. పవన్ చేతిలో ఉన్న మొత్తం సినిమాల సంఖ్య ఏడుకి చేరింది. 2024లో ఎన్నికలు ఉంటాయనుకుంటే..
2022 నుంచి 2023 వరకు పవన్ డైరీ ఫుల్ అయిపోయినట్లే.. ఇవన్నీ ఇలా ఉండగా.. ఎన్నికల ముందు ఓ మంచి మాస్ పొలిటికల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు పవన్. దానికి కూడా టాప్ మాస్ డైరెక్టర్ పని చేసే ఛాన్స్ ఉంది. ఆ సినిమాని కూడా కలుపుకుంటే మొత్తం ఎనిమిది సినిమాలు. సినిమాకి రూ.50 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నా.. మొత్తం రూ.400 కోట్లు అన్నమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే సంపాదిస్తున్నారు.
అందుకేనేమో.. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించకుండా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘భీమ్లానాయక్’ సినిమాను పూర్తి చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొంతభాగం షూటింగ్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. నిన్ననే దర్శకుడు క్రిష్ తో స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు అవతారంలో కనిపించనున్నారు.