పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కుల డీల్ క్లోజ్ అయింది. పవన్ సినిమాకు ఉన్న క్రేజ్ వల్లే సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జీ గ్రూప్ ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులతో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోవడం గమనార్హం. జీ గ్రూప్ సంస్థ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించనుందని బోగట్టా. రిపబ్లిక్ సినిమా నుంచి ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాలకు ఫండింగ్ సమకూరుస్తూ జీ గ్రూప్ వార్తల్లో నిలుస్తోంది. నాగార్జున బంగార్రాజు సినిమా, చరణ్ శంకర్ కాంబో మూవీలో కూడా ఈ సంస్థ వాటా దక్కించుకుంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పవన్ సినిమా పనులతో బిజీ కానున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పవన్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.