పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్పరైజ్ గిఫ్ట్!
- December 26, 2016 / 11:41 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా పనులు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూనే, మరో వైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డాలీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. రెండు రోజుల క్రితమే పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్ కి వచ్చింది. జనవరి ఫస్ట్ ని పవన్ కుటుంబ సభ్యులతో కలిసి సీక్రెట్ గా జరుపుకోనున్నారు. ఆయన టూర్ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుకానుంది. అయితే అభిమానులకు జనవరి ఫస్ట్ కి కానుకగా కాటమరాయుడు సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయమని చెప్పిన్నట్లు సమాచారం.
అందుకోసం డాలీ బృందం శ్రమిస్తోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కలిసి దీపం వెలిగిస్తున్న ఆ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. సినిమాపై అంచనాలను కూడా పెంచింది. ఇప్పుడు రానున్న పోస్టర్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ తొలిసారిగా ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్న ఇందులో ఆయనకు తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజులు నటిస్తున్నారు. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా మార్చి 29న రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















