Bheemla Nayak: పవన్- రానా మల్టీస్టారర్ టైటిల్ అదేనట!
- August 14, 2021 / 04:08 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు కూడా అదే..! మాస్ ఆడియెన్స్ కు పవన్ క్యారెక్టర్ పేరు కూడా బాగా నచ్చేసింది. కాబట్టి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ నే మేకర్స్ ఫిక్స్ చేసినట్టు వినికిడి.
దాదాపు ఈ టైటిల్ ఖరారు అయిపోయినట్టేనని తెలుస్తుంది..! రేపు అనగా ఆగష్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఉండగా కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మేకర్స్. మలయాళంలో అయితే ఇద్దరు హీరోల క్యారెక్టర్ పేర్లు వచ్చేలా టైటిల్ పెట్టారు. ఇక్కడ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరునే హైలెట్ చేశారు.

నిన్న ఇచ్చిన అప్డేట్ పోస్టర్లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నిజానికి ఇద్దరి ఇమేజ్ లకు సంబంధం లేకపోవచ్చు. కానీ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు సమాన ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి కదా అనేది విశ్లేషకుల మాట.సరే ఈ విషయాలను పక్కన పెడితే.. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మేనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

















