Pawan Kalyan: వారాహి గురించి వైరల్ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ గురించి అభిమానులకు పెద్దగా టెన్షన్ ఏమీ ఉండదు కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో జనసేనాని ఇంటి వద్ద రెక్కి, హత్యకు సుపారీ ఇచ్చారనే వార్తలతో భయాందోళనకు గురవుతున్నారు.. పవర్ స్టార్ భద్రత కోసం మాజీ ఆర్మీ ఇంటిలిజెన్స్ అధికారులను నియమించుకున్నారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.. జనసేనానికి రక్షణ కల్పించడం కోసం పది మంది మాజీ అధికారులు ఆయన ఇంటికి చేరకున్నారంటూ ఓ ఫోటో తెగ వైరల్ అయింది..

దీంతో.. ప్రభుత్వం కలుగజేసుకుని పవన్‌కి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని.. తమ అభిమాన నటుడి మీద ఈగ వాలినా మా విశ్వరూపం చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్యాన్స్, జనసైనికులు.. ఇటీవలే తన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనంతో పవన్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.. ఈ వాహనానికి పవన్ ‘వారాహి’ అనే పేరు పెట్టారు..

అయితే వాహనానికి నిషేదిత రంగు వేశారంటూ కామెంట్స్ చేస్తుండడంతో స్వయంగా పవన్ రియాక్ట్ అయ్యారు.. తన స్టైల్లో ఓ పవర్‌ఫుల్ పంచ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ‘‘ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారు. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు.. మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు.. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు.. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు..

కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా?.. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?’’ అంటూ పవర్ స్టార్ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.. పవన్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చారంటూ జనసైనికులు, అభిమానులు ఆయను చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగులో పాల్గొంటున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus