జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) ప్రేక్షకుల్లో, ప్రజల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి జనసేన ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కిందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. పవన్ కు హోం శాఖ లేదా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ దక్కుతుందో మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మరోవైపు ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అందుకునే వేతనం ఎంత అనే చర్చ సైతం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు నెలకు లక్షా 75 వేల రూపాయలు వేతనం అందనుందని జీతంతో పాటు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్ అందుబాటులో ఉంటాయని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయనకు అదనపు సదుపాయాలు, సౌకర్యాలు అందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా జీతభత్యాలలో తేడాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ మంత్రి పదవి స్వీకరించడంతో పవన్ సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఇతర నేతలకు పౌరసరఫరాల శాఖ, పర్యాటకం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించినట్టు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. రాజకీయాల్లో పవన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో, రాజకీయాల్లో తిరుగులేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పవన్ వరుసగా పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.