జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ ద్విగ్విజయంగా సాగుతోంది. ఆయనకు అక్కడి తెలుగు వారు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. రెండు రోజులుగా పలు ఈవెంట్లో పవన్ పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు. నిన్న న్యూ హ్యామ్ షైర్ లోని నౌషలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ జనసేనాని భుజం పై అభిమానులు ఎర్రతువ్వాలును వేశారు. అలాగే మాట్లాడాలని కోరారు. దీంతో ఆనందపడిన పవన్ తువ్వాలు గురించి రెండు మాటలు చెప్పారు. “ఈ తువ్వాలును నేను ఫ్యాషన్ కోసమో ట్రెండ్ కోసమో వేసుకోవడం లేదు.. ఇది సామాన్యుడి సింబల్. శ్రామికుడి చిహ్నం.
దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతీయ భేదం లేదు” అంటూ పవర్ స్టార్ చెప్పారు. ఈ టవల్ ని పవన్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఎక్కువగా వాడుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ లోను ఉపయోగించారు. సినిమాలోనే కాకుండా అనంతపురంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లోను ఈ టవల్ ని భుజంపై వేసుకొని ప్రసంగించారు. ఇప్పుడు అమెరికాలోను ఈ టవల్ వేసుకొని మాట్లాడి తెలుగోడు అనిపించుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.