టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నిర్మించిన జాను ఘోరపరాజయం పొందింది. ఇక ఆయన నిర్మాతగా ఉన్న అన్ని సినిమాలు లాక్ డౌన్ కారణంగా ఇరుకున పడ్డాయి. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన వి మూవీ విడుదల కాకుండా ఆగిపోయింది. హిందీలో నిర్మిస్తున్న జెర్సీ రీమేక్ మరియు పవన్ తో చేస్తున్న వకీల్ సాబ్ చిత్రాల చిత్రీకరణ కూడా మధ్యలో నిలిచిపోవడం జరిగింది. వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, విడుదల చేసి సొమ్ము చేసుకుందాము అనే లోపు లాక్ డౌన్ వలన బ్రేక్ వేసింది.
ఒక విధంగా చెప్పాలంటే దిల్ రాజుకి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు సినిమాల పెట్టుబడి రూపంలో స్థంభించిపోయింది. కాగా వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, భారీ బుడ్జెత్ తో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీని కూడా త్వరగా విడుదల చేయాలని దిల్ రాజు ఆలోచనలో ఉన్నారట. అందుకని వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి అయ్యేవరకు నిరవధికంగా డేట్స్ ఇవ్వాలని పవన్ ని కోరారట.
మరో 20 నుండి 30 రోజులు వకీల్ సాబ్ షూట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారట. ఆ జూన్ మొదటివారం నుండి ఈ మూవీ చిత్రీకణ మొదలుకానుంది. త్వరలో థియేటర్స్ కూడా తెరుచుకోనే మార్గం ఉన్న తరుణంలో ఆగస్టు కల్లా వకీల్ సాబ్ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నాడట. అన్నీ కుదిరి సాధారణ పరిస్థితులు ఏర్పడితే జులై చివర్లో లేదా ఆగష్టు 15కి వకీల్ సాబ్ విడుదల ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.