Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?
- January 23, 2026 / 06:17 PM ISTByFilmy Focus Writer
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ‘OG’ సినిమా హిట్‌గా నిలవడం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో.. ఇక పవన్ కొత్త సినిమాలు ఉండవేమో అని అందరూ భావించారు. కానీ పవర్‌స్టార్ తన లైనప్‌తో అందరికీ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన చేయబోయే భారీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
Pawan Kalyan
ఎస్‌ఆర్టీ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలమైనా, పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 2026 మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ గేమ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, సురేందర్ రెడ్డి ఒక స్టైలిష్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి నాటికి ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న కొన్ని పాటల చిత్రీకరణను ఆయన పూర్తి చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ వర్క్ కంప్లీట్ అవ్వగానే, పవన్ నేరుగా సురేందర్ రెడ్డి సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. అంటే 2026లో పవర్‌స్టార్ నుండి వరుసగా రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, వీరిద్దరి కాంబోలో ఒక సెన్సేషనల్ హిట్ రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
















