భారీ అంచనాలు….భారీగా పెట్టుబడి…బడా క్యాస్టింగ్….ఇవన్నీ పక్కన పెడితే….హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇన్ని భారీ హంగులు ఉన్నప్పటికీ ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన “సర్దార్ గబ్బర్ సింగ్” కనీసం ఒక్క సెంటర్ లో కూడా యావరేజ్ టాక్ ను సంపాదించుకోలేక చతికిలపడింది. ఆ సినిమా పర్వాలేదు అన్న వారు కూడా లేకపోవడంతో దాదాపుగా డిజాస్టర్ అన్న పదానికి సింబల్ గా మారిపోయింది. అయితే మరో పక్క ఈ సినిమా కధ పూర్తిగా ముగియడంతో, ఈ సినిమా మిగిల్చిన నష్టాలు….బయ్యర్ల కష్టాలపై ఫోకస్ పెట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
ఈ సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకునే క్రమంలో వెంటనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే క్రమంలో ఈ సినిమా మొదలు పెట్టక ముందే….సర్దార్ లెక్కలను సారి చేసి అప్పుడు బరిలోకి దిగాలని ఆలోచనలో ఉన్నాడు మన గబ్బర్ సింగ్. అందులో భాగంగానే….కొత్త సినిమాకు 25శాతం రీబేట్ కూడా ప్రకటించేసాడు. అంతేకకాకుండా తన పారితోషకం నూంచ్ దాదాపుగా కొంత సొమ్ముని వెనక్కు ఇచ్చేందుకు పవన్ సిద్దం అయినట్లు సమాచారం. ఎస్. జె సూర్య దర్శకత్వంలో మొదలవనున్న ఈ సినిమాకు పవన్ 30కోట్ల రూపాయల రెమ్యునిరేషన్ తీసుకునటున్నట్లు సమాచారం. ఇక ఆ సొమ్ములో దాదాపుగా 6కోట్ల రూపాయలను బయ్యర్స్ కు ఇచ్చి వారిని ఓదార్చే క్రమంలో ఉన్నాడు పవన్. ఎందుకంటే ఈ లెక్కల విషయాలు అన్నీ వచ్చే సినిమాపై ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పవన్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.