Pawan Kalyan: పవర్ స్టార్ త్రిపాత్రభినయం.. అలాంటి పాత్రల్లో..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా గురించి వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై భారీగా అంచనాలను పెంచడంతో పాటు ఫ్యాన్స్ ను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రలను అద్భుతంగా క్రియేట్ చేశారని తెలుస్తోంది.

రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నెలలోనే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలు కానుందని దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజైన హరిహర వీరమల్లు పోస్టర్ మూవీపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ ఒక పాత్రలో దొంగగా కనిపించనున్నాడని తెలుస్తుండగా మిగిలిన పాత్రలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పవన్ మూడు పాత్రల గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ కు జోడీగా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తన సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో మాత్రం భిన్నమైన పాత్రను పోషిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus