“నాక్కొంచెం తిక్కుంది.. దానికో లేక్కుంది, నేను చెప్పినా ఒకటే.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే” అంటూ పవన్ కళ్యాణ్ వెండితెరపై పంచ్ డైలాగులతో, అదరగొట్టే ఫైట్లతో అభిమానులను విశేషంగా అలరించినే పవన్ కళ్యాణ్ అదే తరహాలో “కాంగ్రెస్ హటావో దేశ్ బచావో” అనే నినాదాన్నివ్వడంతోపాటుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా అనేది కనిపించకుండా చేసిన విషయం గురించి ప్రత్యేకించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. పవన్ కళ్యాణ్ ద్వారా డైరెక్ట్ గానే కాక ఇండైరెక్ట్ గానూ ఎంతో లాభం పొందిన తెదేపా మంత్రులైన అశోక్ గజపతిరాజు, పితానిలు తమకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు, అసలు “జనసేన” అనే పార్టీ ఉందా అంటూ వెకిలి సమాధానాలిచ్చారు.
పోలిటికల్ లీడర్లైన వాళ్ళే అంత కామెడీ చేసినప్పుడు.. వారికి సమాధానం ఎలా ఇవ్వాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలియదంటారా. అందుకే పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ సాక్షిగా “అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరూ తెలీదు, మంత్రి పితాని గారికి పవణ్ కళ్యాణ్ ఏంటో తెలీదు.. సంతోషం” అంటూ మాంచి సర్కాస్టిక్ రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ తరహా వెటకారపు సమాధానం ఎక్స్ పెక్ట్ చేయని టిడిపి లీడర్లు షాక్ అయ్యారు. ఎంత సినిమా వాడైతే మాత్రం పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ పై కామెంట్ వేయడానికి పోలిటికల్ లీడర్లు, అది కూడా పవన్ చరిష్మాను వాడుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులకు తగునా చెప్పండి.