Kushi Re-release: ‘ఖుషి’ రికార్డులు బద్దలు కాలేదట.. అక్కడ తప్ప

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మార్కెట్ ను రెండు రెట్లు పెంచిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఇంకా పెరిగింది. చాలా మందికి ఈ మూవీ హాట్ ఫేవరెట్. అందుకే 4కేలో రీ రిలీజ్ అయినా మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు థియేటర్ కి వెళ్లి చూశారు. రీ రిలీజ్ లో కూడా రికార్డు వసూళ్లు రాబట్టింది ‘ఖుషి’.

అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ అయిన ‘సింహాద్రి’ మూవీ కలెక్షన్లు.. ‘ఖుషి’ కలెక్షన్లను అధిగమించినట్టు.. ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాల కలెక్షన్ల గురించి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ రీ రిలీజ్ లో కూడా సక్సెస్ అందుకున్న మాట నిజం. కానీ ‘ఖుషి’ రికార్డులను ఈ మూవీ బద్దలుకొట్టలేదు. ‘సింహాద్రి’ ఓవర్సీస్ లో, జపాన్ వంటి దేశాల్లో కూడా ‘సింహాద్రి’ రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించింది.

అక్కడ ఓకే.. కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే (Kushi) ‘ఖుషి’ పై ‘సింహాద్రి’ పై చేయి సాధించలేదు. 2003 లో రిలీజ్ అయిన ‘సింహాద్రి’ మూవీ ఎన్టీఆర్ మార్కెట్ ను డబుల్ చేసింది. రాజమౌళికి మొదటి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది ఈ మూవీ. ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ ను ఎన్టీఆర్ తర్వాత అందుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు.

Pushpa Jagadeesh and Sathi Gani Rendu Ekaralu Movie Team Exclusive Interview | Filmy Focus Originals

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus