Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ .. ఈసారి పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు..!

‘మైత్రీ మూవీ మేకర్స్‌’ బ్యానర్ పై నవీన్, రవి శంకర్ ల నిర్మాణంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీష్ కాంబినేషన్లో రూపొందుతున్న రెండో మూవీ ఇది. 2016 లో వచ్చిన ‘తేరి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు మార్చి రీమేక్ చేస్తున్నాడు హరీష్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఈరోజు అంటే మే 11న ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 42 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్… గీత సారాంశంలోని ఓ శ్లోకంతో స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ లుంగీలో వెనుక పిస్టల్ పెట్టుకొని ఊర మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ‘భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ.

ఈ సారి పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు, బద్దలైపోద్ది..’ అంటూ పవన్ కళ్యాణ్ పలికిన డైలాగ్ అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పవచ్చు. ‘గబ్బర్‌ సింగ్‌’ ను మరిపించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ ను (Ustaad Bhagat Singh) రెడీ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బిజీయం కూడా గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus