పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటలే కాదు, చేతలు కూడా చాలా డిఫరెంట్. తాజాగా పవన్ అన్నీ తనై నటించి నిర్మించి, తెరకెక్కించిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. అయితే ఈ సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పుకోవడం ఎందుకులే కానీ, ఈ సినిమాకు వసూళ్ల కన్నా, నష్టాలే ఎక్కువ వచ్చాయి. అయితే ఈ నష్టాల విషయంలో బయ్యర్స్ అంతా కలసి పవన్ దగ్గరకు వెళ్ళి అడగాలి అనుకునే లోపే, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రమోషన్ నిమిత్తం మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ తన స్టాప్ కు జీతాలు ఇవ్వలేని స్థితిలో తాను ఉన్నానని చెప్పడం వల్ల పవన్ పై సానుభూతి మాట పక్కన పెడితే, బయ్యర్ల కోపం మాత్రం చల్లబడింది. దాదాపుగా సగానికి పైగా నష్టపోయిన బయ్యర్లు పవన్ ను నిలదియ్యలి అనుకుని చివరకు పవన్ చెప్పిన మాటలకు వెనక్కి తగ్గారు.
ఇక మరో పక్క తన వల్ల నష్టపోయిన వారిని ఆదుకునే క్రమంలో, పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో నటించ బోతున్న ‘హుషారు’ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో నిర్మించి ఆ సినిమా రైట్స్ ను ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు తక్కువ రేట్లకు ఈ సినిమా ఏరియా రైట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే, ఆ సినిమా హిట్ అయ్యీ మంచి వసూళ్లు రాబడితే కొంతలో కొంత బయ్యర్స్ సేవ్ అయినట్లే. ఇక మరో పక్క ఎస్.జె. సూర్య సినిమా తరువాత పవన్, త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసి, ఆ తరువాత దాసరికి ఇచ్చిన మాట ప్రకారం మరో సినిమాను తీయలనే ఆలోచనలో సమాచారం. మరి అసలే కష్టాల్లో ఉన్న పవన్ ను ఎస్.జె. సూర్య ఎంతవరకూ ఆదుకుంటాడో చూడాలి.