నటుడు రాకేష్ వర్రే (Rakesh Varre) నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అతని నిర్మాణంలో రూపొందిన మొదటి సినిమా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ 2019 లో విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. తర్వాత ఓటీటీలో కూడా కొంతమంది ఆ సినిమా చూసి బాగుంది అన్నారు. ఇక రెండో ప్రయత్నంగా ఇప్పుడు ‘పేక మేడలు’ (Pekamedalu) అనే సినిమా చేశాడు. ‘నా పేరు శివ’ (Naan Mahaan Alla) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) వంటి సినిమాల్లో విలన్ గా చేసిన వినోద్ కిషన్ (Vinod Kishan) ఇందులో హీరోగా నటించాడు.
అనూష కృష్ణ (Anoosha Krishna) హీరోయిన్. నీలగిరి మామిళ్ళ (Neelagiri Mamilla) దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 19 న విడుదల కాబోతోంది. అయితే కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జూలై 17 నుండి ప్రీమియర్స్ షోలు వేశారు. పైగా టికెట్ రేటు కూడా 50 రూపాయలే పెట్టడంతో ‘పేక మేడలు’ సినిమాపై మూవీ లవర్స్ దృష్టి పడింది. మొత్తంగా నిన్న ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
బీటెక్ చదువుకుని .. తన చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం మానేసి.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి షార్ట్ కట్లో లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటాడు లక్ష్మణ్. పూర్తిగా భార్య వరలక్ష్మీ సంపాదనపైనే ఆధారపడి బ్రతుకుతూ.. మరోపక్క ఓ ఎన్నారై ఆంటీ ట్రాప్లో పడతాడు. ఇక కుటుంబాన్ని పోషించడానికి కర్రీ పాయింట్ పెట్టుకోవాలని భార్య అతన్ని కోరితే.. ఆమె పేరు చెప్పి డబ్బులు అప్పు తీసుకుని వాటితో కూడా జల్సాలు చేసేస్తాడు అతను.
తర్వాత ఈ విషయాలు అన్నీ భార్యకి తెలుస్తాయి. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఇక సినిమా చూసిన వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బాగుందట. సెకండాఫ్ లో డ్రాగ్ ఉందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ మళ్ళీ ఊపందుకుంది అంటున్నారు. ఒకసారి చూసే విధంగా అయితే ఈ సినిమా ఉందని అంటున్నారు. చూడాలి మరి.. రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో..!