Raj Tarun-Lavanya Case: లావణ్య కేసు విషయంలో మళ్ళీ చిక్కుల్లో పడ్డ రాజ్ తరుణ్
- September 6, 2024 / 03:00 PM ISTByFilmy Focus
లావణ్య- రాజ్ తరుణ్ (Raj Tarun) ..ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ‘తిరగబడరాసామి’ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ డేటింగ్లో ఉన్నాడని, అయితే ముందుగా తనను ప్రేమించి, సహజీవనంలో ఉండి,సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించి.. ఇప్పుడు వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లు లావణ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసుపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ సడన్ గా లావణ్య- రాజ్ తరుణ్ సైలెంట్ అయిపోవడంతో..
Raj Tarun-Lavanya Case

ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే, రాజ్ తరుణ్ (Raj Tarun) .. కేసు నుండీ బయటపడినట్టే అని అంతా భావించారు. కానీ ఇంతలో ఇంకో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. లావణ్య కేసు విషయంలో… ఛార్జ్ షీట్లో రాజ్ తరుణ్ పేరు జోడించడం జరిగిందని సమాచారం. కొద్దిరోజుల క్రితం లావణ్య.. రాజ్ తరుణ్ పై కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆధారాలు వంటివి ఏమీ సబ్మిట్ చేయలేదు. ఈ విషయాన్నే ‘తిరగబడరసామి’ ప్రెస్ మీట్లలో రాజ్ తరుణ్ ప్రస్తావించడం జరిగింది.

అందువల్ల రాజ్ తరుణ్ (Raj Tarun) కి కొద్దిరోజుల పాటు కొంత ఊరట లభించింది. కానీ 10 ఏళ్ళ వరకు ఇద్దరూ సహజీవనం చేసినట్టు నిర్దారించడంతో రాజ్ తరుణ్ మళ్ళీ చిక్కుల్లో పడినట్టు అయ్యింది. బెయిల్ తీసుకోవడం వల్ల ఇప్పటివరకు రాజ్ తరుణ్ పేరు ఛార్జ్ షీట్లో ఇన్క్లూడ్ కాలేదట. కానీ ఇప్పుడు ఇప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అతని పేరు కూడా ఛార్జ్ షీట్లో జోడించడం వల్ల మళ్ళీ రాజ్ తరుణ్ వార్తల్లో నిలిచాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..!















