యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘జనతా గ్యారేజ్’ టీజర్ నిన్న రంజాన్ సంధర్భంగా విదులయ్యింది. అలా విడుదలయిన కొన్ని గంటల్లోనే టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఒక్క యంగ్ టైగర్ అభిమానులకే కాకుండా ఈ టీజర్ అందరికీ నచ్చడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఈ టీజర్ పై అందరూ పాసిటీవ్ గా స్పందిస్తున్నప్పటికీ…కొందరు రకరకాల ఊహాగానాలకు తెరలేపుతున్నారు….కొందరు ఈ ట్రైలర్ గురించి మాట్లాడుతూ…జూనియర్ తన డైలాగ్ డెలివరీ స్టయిల్ లో కూడా కాస్త మార్పులు చేసినట్లు కనిపిస్తోంది అంటూ కామెంట్ చెయ్యడమే కాకుండా…స్లో అండ్ సెటిల్ గా పంచ్ పేలుస్తూ జూనియర్ ఈ సినిమాలో తాను రొటీన్ కు భిన్నంగా విలక్షణంగా కనిపించ బోతున్నాను అన్న సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది అంటున్నారు.
మరికొందరు….ఈ టీజర్ లో ఎన్టీఆర్ పేల్చిన డైలాగ్ ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ, ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’ అన్న దానిపై మాట్లాడుతూ…డైలాగ్ వెనుక రాజకీయ కోణం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఈ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు అన్న విశ్లేషణలు జరుగుతూ ఉండడం విశేషం. అయితే ఇదంతా పక్కన పెడితే…..మూడుగా మనం మెచ్చుకోవాల్సింది దర్శకుడు కొరటాల శివ ని…రెండున్నర గంటల సినిమా కథను కేవలం 34 సెకన్ల టీజర్ లో ఆసక్తి కలిగేలా ఒకే ఒక్క పంచ్ డైలాగ్ తో కొరటాల శివ ఈ టీజర్ ను డిజైన్ చేయడం అతడి సమర్ధతకు నిదర్శనం అని చెప్పక తప్పదు…..ఇక ఈ తీాజ్ర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని..మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ 100 కోట్ల కల నెరవేరుతుందేమో చూడాలి.