దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న పూజాహెగ్డే నటించిన వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. ఇలా ఈమె బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలు ఫెయిల్ కావడంతో ఈమె కెరియర్ స్లో అవుతుందని అందరూ భావించారు. అయితే వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురవుతున్నప్పటికీ ఈ సినిమాల ప్రభావం తన కెరియర్ పై పడలేదని చెప్పాలి. ఇలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ పూజా హెగ్డే కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎఫ్ 3ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన పూజా హెగ్డే అనంతరం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనగణమన సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే విధంగా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజా హెగ్డే అవకాశాన్ని అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా కోసం పూజాహెగ్డే డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ ముద్దుగుమ్మకు వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చిన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటూ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇది వరకు పూజా హెగ్డే ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఈమె నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ విధంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తన స్టాఫ్ కోసం అయ్యే ఖర్చులను కూడా నిర్మాతలు భరించాలని డిమాండ్ చేస్తున్నారట. ఈమె స్టాప్ కు ఎంత లేదన్న మరో కోటి రూపాయలు అధికంగా ఖర్చు అవుతుందని, ఆ కర్చు మొత్తం నిర్మాతలే భరించాల్సి ఉంటుందని పూజాహెగ్డే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఈమె ఇలా డిమాండ్ చేస్తే ఫ్యూచర్లో తనకు సినిమా అవకాశాలు రావడం కష్టతరమవుతుందని మరి కొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.