ఈరోజు ఏపి సీ.ఎం జగన్మోహన్ రెడ్డితో.. టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం అయ్యారు.టికెట్ రేట్ల ఇష్యు గురించి అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యమంత్రితో వారు డిస్కస్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు హాజరైన సినీ ప్రముఖులు.. టికెట్ రేట్ల ఇష్యుతో సంబంధం లేని వారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అలాగే రాజమౌళి,కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. నిజానికి నిర్మాతల్ని కమ్ డిస్ట్రిబ్యూటర్లు వంటి వాళ్ళు ఈ మీటింగ్ కు హాజరు కావాలి. కానీ అలా ఏమీ జరగలేదు. నిన్న కాక మొన్నొచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరయ్యాడు.
అది ఇంకా పెద్ద విడ్డూరం. ‘మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు వెళ్లి జగన్ తో డిస్కస్ చేసేంత ఏముంటుంది? ఏదో వాళ్ళకి థియేటర్లలో భాగస్వామ్యం ఉందనేనా? లేక జగన్ కి సెల్ఫీలు ఇవ్వడానికి వెళ్ళారా?’ అనే డిస్కషన్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఈ మీటింగ్ లో ఏమి మాట్లాడుకున్నారో ఎవ్వరికీ తెలీదు, తెలిసే అవకాశం కూడా ఉండదు. `ఎండ్ కార్డ్ కాదు.. శుభం కార్డు పడుతుంది… అంతా మంచే జరుగుతుంది` అంటూ చిరంజీవి ఎప్పటిలానే మంచి మాటలు చెప్పి అందరికీ బిస్కట్లు వేయడం కూడా కామన్ గానే జరిగింది.
అయితే..ఈ మీటింగ్లో పోసాని కృష్ణమురళి కూడా పాల్గొన్నాడు. అతను వైసీపీకి మద్దతుదారుడే అన్న సంగతి తెలిసిందే.పైగా అతను స్టార్ హీరోల పై సెటైర్లు వేసాడని వినికిడి.’స్టార్ హీరోలంతా.. పారితోషికాలు భారీగా పెంచేశారు,అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి నిర్మాతల పై భారం పడుతుంది,దాని వల్ల టికెట్ రేట్లు పెంచేసి సామాన్య ప్రేక్షకుల పై భారం వేసేస్తున్నారు’ అంటూ చిరు, మహేష్, ప్రభాస్ ల మొహాల పై పోసాని మాట్లాడాడని సమాచారం.
ఈ క్రమంలో జగన్.. పోసానిని కంట్రోల్ చేస్తూ.. `విషయం పక్కదారికి వెళ్లొద్దు` అంటూ పోసానికి సర్ది చెప్పారట. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీటింగ్ అంతా అయిపోయాక ఈ స్టార్లంతా మైక్ ముందు మాట్లాడుతూ సీఎం జగన్ కు పెద్ద ఎత్తున థాంక్స్ చెప్పడం చిత్ర విచిత్రమైన విషయం. ‘సమస్యని సృష్టించిన వ్యక్తికే థాంక్స్ లు చెప్పి సన్మానాలు చేయడం ఏంటో? ఓ రకంగా నాని, పవన్ కళ్యాణ్, సిద్దార్థ్ వంటి వాళ్ళే గ్రేట్’ అనే సెటైర్లు ఇప్పుడు ఊపందుకున్నాయి.