Prabhas, Amitabh: ‘బాహుబలి’తో అమితాబ్.. ఒకరినొకరు బాగానే పొగుడుకున్నారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో సక్సెస్ అందుకొని ఆ తరువాత ‘మహానటి’తో నేషనల్ లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న నాగ్ అశ్విన్.. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

Click Here To Watch

‘ప్రాజెక్ట్ K’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తాజా షెడ్యూల్ లో ఆయన పాల్గొన్నారు. అమితాబ్, ప్రభాస్ లపై కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనిపై ప్రభాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘నా కల నిజమైంది. లెజెండ్రీ అమితాబ్ బచ్చన్ గారితో ఈరోజు నా తొలి స‌న్నివేశాన్ని పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చారు. అలానే అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘ఫస్ట్ డే, ఫస్ట్ షాట్.. ‘బాహుబలి’ ప్రభాస్‌తో ఫస్ట్ ఫిల్మ్. అతడి వినయం, ప్రతిభ, ఆరా మధ్య ఉండటం గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇలా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటూ పోస్ట్ లు పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ మార్చి 11న ‘రాధేశ్యామ్’ సినిమాతో సందడి చేయబోతున్నారు.

మరోపక్క బాలీవుడ్ లో దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ K’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus