సలార్1 (Salaar) మూవీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మారిపోయి ఉండేది. ప్రశాంత్ నీల్ తర్వాత సినిమా ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతుందా? ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కుతుందా? అనే చర్చ జరగగా సలార్2 మొదట మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
సలార్2 సినిమాకు ప్రభాస్ డేట్స్ కేటాయించాలన్నా సులువు కాని పరిస్థితి నెలకొంది. సలార్2 సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలో మైత్రీ నిర్మాతలు ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాదే మొదలయ్యేలా ప్లాన్ చేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి తారక్ డేట్లు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో తారక్ ప్రశాంత్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. దేవర2 (Devara) కంటే ముందే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి తారక్ సుముఖంగా ఉన్నారని భోగట్టా.
రాజాసాబ్ (The Rajasaab) , హనురాఘవపూడి (Hanu Raghavapudi) మూవీ, కల్కి సీక్వెల్ (Kalki 2898 AD), స్పిరిట్ (Spirit) సినిమాలతో గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాలను వేగంగా పూర్తి చేసి నిర్మాతల ప్లానింగ్ ప్రకారం రిలీజ్ చేసేలా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ నోరు మెదిపితే మాత్రమే ఎన్నో సందేహాలకు చెక్ పడే ఛాన్స్ ఉంటుంది.
ఈ నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు కావడంతో ఆరోజు తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తారక్ ప్రశాంత్ కాంబో మూవీ షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో ఉంటుందని ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు ఇతర దర్శకుల సినిమాలతో పోల్చి చూస్తే ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.