స్టార్ హీరోలకు స్పెషల్ వ్యానిటీ వ్యాన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.వాళ్ళ ఇల్లులు ఎంత విలాసవంతంగా ఉంటాయో.. వాళ్ళ వ్యానిటీ వ్యాన్లను కూడా అంతే విలాసవంతగా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు.ఇది వరకు బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి కాస్ట్ లీ వ్యాన్లు ఉండేవి. కానీ మెల్ల మెల్లగా టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అలాంటి వ్యానిటీ వ్యాన్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికిన ప్రతీసారి స్టార్ హీరోలు ఈ వ్యానిటీ వ్యాన్లలో రిలాక్స్ అవుతుంటారు.
సాధారణంగా అయితే షూటింగ్ సమయంలో నిర్మాతలే హీరోలకు ఇలాంటి కాస్ట్ లీ కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుని షూటింగ్ సమయంలో వాటి అద్దెలు కూడా నిర్మాతల దగ్గర్నుండే వసూల్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల ఓ వ్యానిటీ వ్యాన్ ను కొనుగోలు చేసాడు. అతని అభిరుచికి తగినట్టుగా అందులో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దానిని డిజైన్ చేయించుకున్నాడు.
అంతేకాకుండా దానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటి అంటే ఆ వ్యానిటీ వ్యానులో సహజసిద్దమైన వెలుతురు వచ్చే సన్ రూఫ్ పీచర్ (sunroof feature) ఉండడం. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ కాంతి కాకుండా సహజ సిద్దమైన వెలుతురు ఆస్వాదించేందుకు ఆ వ్యానిటీ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నాడట ప్రభాస్. ఈ విషయాన్ని అతనితో ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కిస్తున్న దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియాలో తెలియజేసాడు.