సాధారణంగా స్టార్ హీరోలు అంటే అభిమానం ఉంటుంది ఇలా వారి అభిమాన హీరోలు సినిమాలు కనుక విడుదలయితే పెద్ద ఎత్తున అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. భారీ కటౌట్ లో ఏర్పాటు చేయడమే కాకుండా పాలాభిషేకాలు చేస్తూ పెద్ద పెద్ద పూలమాలలు వేస్తూ టపాసులు కాలుస్తూ థియేటర్ల ముందు పండగ చేసుకుంటారు.ఇలా అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు ఇలాంటివి చేయడం సర్వసాధారణం. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈయన (Prabhas) నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదని చెప్పాలి. అయితే అభిమానుల అభిమానం కాస్త పీక్స్ కి చేరిందని చెప్పాలి. ఇలా అభిమానులు థియేటర్లలో సినిమా కాస్త ఆలస్యమైన, లేకపోతే సౌండ్ సిస్టం సరిగా పనిచేయకపోయినా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు.
అయితే ఓ అభిమాని మాత్రం ఏకంగా బీరు బాటిల్ తో పదేపదే చేతిని కోసుకుంటూ వచ్చిన రక్తంతో ప్రభాస్ కటౌట్ కి తిలకం దిద్దడమే కాకుండా బీర్ బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి మరికొంతమంది అభిమానులు ఈ దృశ్యాలను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హీరోల పట్ల అభిమానం ఉండాలి అది ఎంతవరకు సినిమా చూసి ఎంజాయ్ చేసామా అనే వరకు మాత్రమే ఉండాలి కానీ ఇలా చేయి కోసుకొని తిలకం దిద్దడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చి నీకు ట్రీట్మెంట్ చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే మరికొందరు అక్కడే ఇదంతా వీడియోగా తీయకపోతే తనని ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.