Prabhas Fans: బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ఆకాష్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్ బజార్’ అనే చిత్రం తెరకెక్కిన్న సంగతి తెలిసిందే. జూన్ 24న ఆ చిత్రం విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి గెస్ట్ గా బండ్ల గణేష్ విచ్చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ ‘టెంపర్’ వంటి చిత్రాలని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ రెండు చిత్రాల్లో ‘టెంపర్’ హిట్ అయ్యింది కానీ ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా కాదు.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నష్టాలనే మిగిల్చింది. ‘ఈ రెండు సినిమాలతో బండ్ల గణేష్ ని స్టార్ ప్రొడ్యూసర్ ని చేశాడు పూరి’ అంటూ కాసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు బాగానే ఉంది. కానీ ‘ఎందర్నో స్టార్లని చేశాడు.. సూపర్ స్టార్లని చేశాడు, డైలాగులు రానోళ్లకి డైలాగులు నేర్పించాడు, డ్యాన్స్ లు రానివాళ్ళకి డాన్సులు నేర్పించాడు, మాములు వాళ్ళని స్టార్లని చేశాడు. కన్న కొడుకు సినిమా వచ్చేసరికి ఎక్కడికో ముంబై వెళ్లి కూర్చున్నాడు.

పూరి జగన్నాథ్ చేతి రాత వల్ల స్టార్లయ్యి వందల కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరోలు వచ్చి పూరి జగన్నాథ్ కొడుకు సినిమా చూడండి అని ప్రమోట్ చేస్తారు అనుకున్నాను.పూరితో సినిమా చేస్తున్న టైంలో ఆకాష్ ని జో కొట్టిన వాళ్లంతా సినిమాల్లో బిజీగా ఉండి రారు ఇక్కడికి. మళ్ళీ వీడు స్టార్ అయితే వాళ్ళకి ఇబ్బంది’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్లో రూ.100 కోట్లకి దరిదాపుల్లో పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్ తప్ప మరెవరూ లేరు.

బండ్ల ప్రభాస్ నే టార్గెట్ చేసి ఈ మాట అన్నాడు అని అతని అభిమానులు అంటున్నారు. అయితే పూరి జగన్నాథ్ ప్రభాస్ కు హిట్లు ఏమీ ఇవ్వలేదు. రెండు సినిమాలు తీస్తే అందులో ఒకటి యావరేజ్, ఇంకోటి ప్లాప్. అయినా సరే అతను ఇండియా వైడ్ స్టార్ హీరో. ‘రొమాంటిక్’ సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేశాడు. తన బిజీ షెడ్యూల్ లో ఓ రోజు ‘రొమాంటిక్’ కోసం కేటాయించి మరీ సినిమాని ప్రమోట్ చేశాడు. ఇలాంటి విషయాలు ఏమీ తెలుసుకోకుండా బండ్ల గణేష్ ఎలా మాట్లాడుతున్నాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus