Prabhas: అలా జరగడం ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చలేదా?

ప్రభాస్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

అయితే పాన్ ఇండియా సినిమా ఆయిన రాధేశ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంతృప్తిగా లేరు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ మూవీ ప్రమోషన్స్ ఊహించని స్థాయిలో జరుగుతుంటే రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం ఈ సినిమాపై ఆర్‌‌ఆర్‌‌ఆర్‌ స్థాయిలో అంచనాలు పెంచడంలో ఫెయిల్ అవుతున్నారు. రాధేశ్యామ్ సినిమా క్లాస్ మూవీ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ఒకింత టెన్షన్ పడుతున్నారు. మాస్ సినిమాలు సాధించిన స్థాయిలో క్లాస్ సినిమాలు కలెక్షన్లను సాధించడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాతైనా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే మాత్రమే కలెక్షన్లపరంగా రాధేశ్యామ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్, రాధేశ్యామ్ మేకర్స్ ఇతర భాషల్లో రాధేశ్యామ్ పై అంచనాలను పెంచే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు రాధేశ్యామ్ తెరకెక్కగా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

రాధేశ్యామ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ సక్సెస్ సాధిస్తే మాత్రమే రాధాకృష్ణ కుమార్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది. కృష్ణంరాజు ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటిస్తుండగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వస్తున్నాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus