Salaar Teaser: ప్రభాస్ అభిమానులకు సలార్ టీజర్ ఇంతలా నచ్చేసిందా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సలార్ సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సలార్ టీజర్ తాజాగా రిలీజ్ కాగా నిమిష నిమిషానికి ఈ టీజర్ వ్యూస్ అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టీజర్ గురించి స్పందిస్తూ ఇన్ఫినీట్ గూస్ బంప్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ ను చూసిన తర్వాత కేజీఎఫ్2 సినిమాకు సలార్ సినిమాకు కచ్చితంగా కనెక్షన్ ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కెజీఎఫ్ ఛాప్టర్3 లో రాకీ భాయ్, (Salaar) సలార్ పాత్రలు రెండూ కనిపిస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్ లాంటి మాస్టర్ పీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ మూవీ పండగ లాంటి మూవీ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ఈ టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. మరికొన్ని సంవత్సరాల పాటు ప్రశాంత్ నీల్ కు కొత్త కథలతో తెరకెక్కే ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం లేదని ఇప్పటికే తీసిన సినిమాలకు ఫ్రాంఛైజీలను ప్రకటిస్తే సరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఈ ఇద్దరు సెలబ్రిటీలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా 3,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి2 సినిమా తర్వాత ఆ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమా సలార్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

;

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus