Prabhas: ప్రభాస్ కు నచ్చకపోయినా ఆ వంటకాన్ని తినిపించేవారా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆయన నటిస్తున్నారు. కల్కి మూవీ ఈ ఏడాది మే నెల 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కల్కి మేకర్స్ మాత్రం ఈ సినిమా పోస్ట్ పోన్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించలేదు.

కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్ ఎన్నో సినిమాల రిలీజ్ డేట్లను ప్రభావితం చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ భోజన ప్రియుడు అనే సంగతి తెలిసిందే. నాన్ వెజ్ వంటకాలను ప్రభాస్ ఇష్టంగా తింటారు. అయితే అన్ని వంటకాలను ఇష్టంగా తినే ప్రభాస్ కు కాకరకాయ మాత్రం అస్సలు నచ్చదట. బాల్యంలో ప్రభాస్ కు ఇష్టం లేకపోయినా ఆరోగ్యానికి మంచిదని కాకరకాయను బలవంతంగా తినిపించేవారట.

ఇప్పుడు మాత్రం ప్రభాస్ కాకరకాయకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాకరకాయ రుచికి చేదుగా ఉండటం వల్ల చాలామంది కాకరకాయకు దూరంగా ఉంటారు. ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా వేర్వేరు కారణాల వల్ల ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్లు మారడం విషయంలో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రైట్స్ కోసం మేకర్స్ 180 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారని తెలుస్తోంది.

కల్కి రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడైతే డిజిటల్ రైట్స్ పరంగా సరికొత్త రికార్డులు ప్రభాస్ ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు. దేవర (Devara), గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాల రైట్స్ ను మించి ఈ సినిమా రైట్స్ అమ్ముడవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ పై దృష్టి పెడితే ఆ సినిమాల రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus