Prabhas: ఆ విషయంలో ప్రభాస్ కల నెరవేరుతుందా?

స్టార్ హీరో ప్రభాస్ కు బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఏ రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపును తెచ్చిపెడితే సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ కు భారీ షాకిచ్చాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ప్రభాస్ కెరీర్ పై ఒకింత ప్రభావం పడిందనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా కూడా థియేటర్లలో త్వరగా విడుదలైతే ఈ సినిమాతో ప్రభాస్ అంచనాలను అందుకోలేడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ రీజన్ వల్లే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను 2024కు వాయిదా వేశారని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లు విడుదలయ్యే వరకు ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేదని బోగట్టా. పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవాలని ప్రభాస్ భావిస్తున్నారని సమాచారం. ప్రభాస్ తీసుకున్న నిర్ణయం విషయంలో అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో రిస్క్ తీసుకోకపోవడమే కరెక్ట్ అని గ్రాఫిక్స్ కు సంబంధించి

పూర్తిస్థాయిలో మార్పులు చేసిన తర్వాత మాత్రమే ఆదిపురుష్ ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఆది పురుష్ ఔట్ పుట్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఓం రౌత్ పై సీరియస్ గా ఉన్నారు. ఓం రౌత్ ప్రభావ్ విలువైన సమయాన్ని వృథా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తన రేంజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ లకు మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus