మన తెలుగు హీరోలకు వెండి తెరలపై కన్నా…యూట్యూబ్ లో ఫాన్స్ రోజు రోజూకీ పెరిగి పోతూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, సహజంగా సినిమా బావుంటేనే అందరూ చూస్తారు, సినిమా బాగోకపోతే కొందరు మాత్రమే చూస్తారు. అలాంటిది డిజాస్టర్ సినిమాను లక్షల్లో, కోట్లలో చూడటం వింతగా ఉంటుంది కదా. అప్పట్లో ఎన్టీఆర్ కరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాష్టర్ గా మిగిలిన రామయ్య వస్తావయ్యా చిత్రం యూ ట్యూబ్ లో దాదాపుగా 70లక్షల మంది చూశారు అదీ హిందీలో. అయితే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినటువంటి ‘రెబల్’ సినిమాని యూ ట్యూబ్ లో కోటి మందికి పైగా చూశారు నార్త్ ఇండియన్స్. అసలు నిన్న మొన్నటి వరకూ ప్రభాస్ అంటే ఎవరో తెలియని నార్త్ ఇండియన్స్ సడన్ గా ప్రభాస్ పై ఇంతటి ప్రేమ ఎందుకు అంటే…అదంతా బాహుబలి ఎఫెక్ట్ అంట. బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోవడంతో, ఆయన సినిమాలను హిందీలోకి డబ్ చేసే ప్రయత్నాల్లో నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఇక మరో పక్క ఇప్పటివరకూ యూట్యూబ్ లో కోటి వ్యూస్ వచ్చిన సినిమా ఏదైన ఉంది అంటే అది మన ప్రభాస్ ‘రెబెల్’ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా…బాహుబలితో ప్రభాస్ తీరే మారిపోయింది. ఒక పార్ట్ కే క్రేజ్ ఇలా ఉంటే, రెండో పార్ట్ కూడా విడుదలయ్యి, భారీ హిట్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.