ప్రభాస్ (Prabhas) తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు. దానిని గమనిస్తే.. ‘ఓ స్పెషల్ వ్యక్తి మన జీవితంలో భాగం కాబోతున్నాడు. వెయిట్ చేయండి’ అంటూ అందులో రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్ హాట్ టాపిక్ అయిపోయాడు. ఇది కచ్చితంగా ప్రభాస్ తన పెళ్లి గురించే పెట్టి ఉంటాడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రభాస్ లానే… ప్రభాస్ పెళ్లి కూడా పాన్ ఇండియా టాపిక్ అయ్యింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) సినిమా టైం నుండి అంటే.. 2011 నుండి పెళ్లి చేసుకుంటాను అని ప్రభాస్ చెబుతున్నాడు.
కానీ చేసుకోవడం లేదు.’ ‘బాహుబలి’ (Baahubali) ఫినిష్ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందని’ కృష్ణంరాజు (Krishnam Raju) సైతం చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత 4 సినిమాలు వచ్చి వెళ్లినా ప్రభాస్ పెళ్లి చేసుకుంది లేదు. ప్రభాస్ కి పెళ్లి పై ధ్యాస లేదు అని అంతా అనుకుంటున్న టైంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘అన్ స్టాపబుల్’ షోకి వచ్చి ‘కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. కానీ ‘ఎప్పుడు?’ అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క ‘ఆదిపురుష్’ (Adipurush) షూటింగ్ టైంలో హీరోయిన్ కృతి సనన్ తో (Kriti Sanon) ప్రభాస్ ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది.
కానీ అందులో నిజం లేదు అని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశాడు. మరోపక్క అనుష్కతో (Anushka Shetty) ప్రభాస్ పెళ్లి అంటూ ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. అందులో కూడా నిజం లేదంటూ ప్రభాస్ చెబుతుంటాడు. మరి ఇప్పుడు ఏ స్పెషల్ పర్సన్ ను పరిచయం చేయబోతున్నాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పోస్ట్ తో ‘పెళ్లిపై ఇంత ఆశ పెడుతున్న ప్రభాస్..చివరికి అది సినిమా గురించో లేక తన అన్న, అక్క..ల పిల్లల గురించో అని చెప్పి డిజప్పాయింట్ చెయ్యడు కదా’ అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది.