Prabhas: కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ భలే ఉందంటున్న ఫ్యాన్స్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ప్రభాస్ శివుడి పాత్ర లుక్ ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఫోటోలు ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. టెక్నాలజీ సహాయంతో శివుడి పాత్రలో ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటం గమనార్హం.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ భలే ఉందని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాలో లుక్ ను ఇదే విధంగా డిజైన్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కన్నప్ప సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సలార్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. సలార్ పార్ట్1 విడుదలయ్యే వరకు సలార్2 సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాదని సమాచారం అందుతోంది.

సలార్1 సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. ప్రభాస్ సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ సలార్ టీజర్ లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సలార్ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. ప్రభాస్ (Prabhas) భవిష్యత్తు సినిమాలతో చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus