బాహుబలి సిరీస్ తర్వాత స్టార్ హీరో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి2 ఇండస్ట్రీ హిట్లు కావడంతో ప్రభాస్ సినిమాల బడ్జెట్ భారీగా పెరగడంతో పాటు ప్రభాస్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారు. తాజాగా ఒక సర్వేలో స్టార్ హీరో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం. టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మెన్ సర్వేలో ప్రభాస్ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఫ్యాన్సీ ఆడ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో హీరో ప్రభాస్ కే ఎక్కువమంది ఓటేయడంతో ప్రభాస్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. చైనా, జపాన్ దేశాల్లో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోగా స్టార్ హీరో ప్రభాస్ కు పేరుంది. ప్రభాస్ ఈ జాబితాలో పలువురు పాకిస్తాన్ నటులతో పాటు సౌత్ కొరియన్ స్టార్ అయిన కిమ్ హ్యూమ్ జాంగ్ ను సైతం అధిగమించి ఆ హీరోలకు షాకివ్వడం గమనార్హం.
కొంతమంది ఫ్యాన్స్ ప్రభాస్ ను చూడాలని ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ షూటింగ్ త్వరలో పూర్తి కానుండగా థియేటర్లు తెరిచిన తర్వాత రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ పై ఉండగా వచ్చే ఏడాది ఈ సినిమాలు రిలీజ్ కానుండటం గమనార్హం.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!