Prabhas: ప్రభాస్‌ లైనప్‌లో ఈ సినిమా ఫిక్స్‌ అయ్యిందట!

‘బాహబలి’ సినిమాలు విడుదలై, ‘సాహో’ సినిమా సిద్ధంగా ఉన్న రోజులవి. బాలీవుడ్‌ దర్శకుడితో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. మీరు కూడా అప్పుడా వార్తలు చదివే ఉంటారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఏమైందో ఏమో మళ్లీ ఆ సినిమా ముచ్చట్లు వినిపించలేదు. అయితే తాజాగా మళ్లీ ఆ సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సినిమా పక్కగా ఓకే అయ్యి, సంతకాలు అయిపోడంతోనే మళ్లీ ఆ ప్రాజెక్ట్‌ టాక్స్‌ బయటకి వచ్చాయంటున్నారు.

బాలీవుడ్‌లో ‘వార్‌’, ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ సినిమాలతో యాక్షన్‌ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సిద్ధార్థ్‌ ఆనంద్‌. ఆ దర్శకుడితోనే ప్రభాస్‌ కొత్త సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఈ సినిమాతోనే అని కూడా అన్నారు. అయితే ఈలోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌, ప్రభాస్‌ ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోవడంతో మళ్లీ ఆ టాక్స్‌ వినిపించలేదు. అయితే ఇటీవల ప్రభాస్‌కు సిద్ధార్థ్‌ ఆనంద్‌ మంచి యాక్షన్‌ సినిమా కథ చెప్పాడని, ఓకే అవ్వడంతో ప్రాజెక్ట్‌ లాక్‌ అయ్యిందని చెబుతున్నారు.

ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ చేతిలో రెండు బాలీవుడ్‌ సినిమాలున్నాయి. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’, హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత ప్రభాస్‌తో సినిమా పట్టాలెక్కుతుందట. దీనికి కనీసం రెండేళ్ల పట్టొచ్చు అని టాక్‌. ఇక ప్రభాస్‌ వైపు నుండి చూసినా ఇదే పరిస్థితి. ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ‘సలార్‌’, ‘స్పిరిట్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ ఉన్నాయి. ఇవన్నీ అయ్యాకే సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమా ఉండొచ్చట. అయితే మధ్యలో ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.

సో మైత్రీ మూవీ మేకర్స్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇంకొన్ని రోజులు ఆలస్యం అయ్యేలా ఉంది. అయితే రావడంలో ఆలస్యం అవ్వొచ్చు కానీ, ఎంట్రీ మాత్రం అదిరిపోద్ది అని చెబుతున్నాయి మైత్రీ మూవీ మేకర్స్‌ వర్గాలు. ప్రభాస్‌ ఇప్పటివరకు చూపినంత యాక్షన్‌ మోడ్‌లో ఆ సినిమాలో చూడొచ్చనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus