Prabhas25: ‘ప్రభాస్ 25’.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..!

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ అలాగే..’కె.జి.ఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే…దానిపై ఏ రేంజ్లో అంచనాలు నమోదవుతాయో ఆ రేంజ్లో ‘సలార్’ పై అంచనాలు నెలకొన్నాయి.ఇది ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కావడం విశేషం. ‘సలార్’ వచ్చే ఏడాది అంటే 2022 లో విడుదల కాబోతుందని ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇదే కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతుంది అని..

దానిని దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటివరకు అది గాలి వార్తే అనుకున్నారంతా.! కానీ నిజంగానే ప్ర‌భాస్‌,ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని దానిని దిల్ రాజు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అతని సన్నిహిత వర్గం నుండీ సమాచారం అందింది. ఇది ప్ర‌భాస్ 25వ సినిమాగా తెర‌కెక్క‌నుందట. మైథలాజికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తుంది.

‘బాహుబ‌లి’ ని మించి ఈ మూవీ ఉండబోతుందట.దీనిని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కిస్తారని సమాచారం. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నార‌ని.. రూ.400 కోట్ల పైనే బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. ‘#prabhas25’ హ్యాష్ ట్యాగ్ తో ఈ టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండడం విశేషం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus