Prabhas: సల్మాన్ రూటులో ప్రభాస్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధె’ సినిమాను ఒకేసారి ఓటీటీలో, అలానే అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదల చేశారు. ఓటీటీలో పే పర్ వ్యూ పద్దతిలో సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పద్ధతిని ‘రాధేశ్యామ్’ టీమ్ కూడా ఫాలో అయ్యేలా ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను వీలైతే ఒకేసారి ఇటు ఓటీటీలో, అటు థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జీ గ్రూప్ సంస్థ ఈ విషయమై ‘రాధేశ్యామ్’ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సంస్థ ‘రాధె’ సినిమాను కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు అదే తరహాలో ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి ‘రాధె’ సినిమా రిలీజ్ సమయంలో దేశంలో పరిస్థితులు ఏమంత బాగాలేవు. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ వలన థియేటర్లను మూసేసారు. దీంతో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తూ.. అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజ్ చేశారు.

కానీ ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే ‘రాధేశ్యామ్’కు కూడా థియేటర్ల సమస్య ఎదురయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. జూలై 30న సినిమా రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సమయానికి థియేటర్లు తెరుచుకుంటాయో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే ‘రాధె’ సినిమా రూట్ ను ఫాలో అవ్వాలని భావిస్తున్నారు ప్రభాస్ నిర్మాతలు. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus